తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా భైంసా పట్టణంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా భైంసా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్‌లో బీజేపీ టౌన్ శాఖ, బీజేవైఎం నాయకులు ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంప్ కార్యాలయాలను, గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని వారు పేర్కొన్నారు.












