జగిత్యాల, సిరిసిల్లలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భాగస్వామ్యం సభ విజయవంతం కావడానికి దోహదపడిందని ఆయన అన్నారు.
జగిత్యాల, సిరిసిల్లలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు జగిత్యాల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సభను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందించిన సహకారం, మద్దతు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే అభినందించారు. ప్రజల నుంచి లభించిన స్పందన కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.












