ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే తొలగించాలని, ఓటర్ల సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ఏవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
భారత ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని, సర్దుబాటు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఓటర్ల తొలగింపు అన్యాయం
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్, బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్దుబాటు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులకు లభించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం అన్యాయమని, అక్రమమని అన్నారు.
బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని విమర్శ
తొలగించిన ఓట్లను వెంటనే తిరిగి పునరుద్ధరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఇతర ఇద్దరు కమిషనర్ల సూచనలు వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీజేపీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని చేర్చాలని అన్నారు. ఫారం 6 ను పాత పద్ధతిలోనే కొనసాగించాలని అన్నారు.
పోరాటం కొనసాగుతుంది
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ ను తొలగించేదాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మల్లేశం, మాణిక్యం సాయిలు, నాయకులు యాదగిరి, అశోక్, వెంట్రాజం, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.












