తెలంగాణలో పెండింగ్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలతో పాటు పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో పెండింగ్‌లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియలను సిద్ధం చేసే పనులపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ల అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల తేదీలు, అధికారిక షెడ్యూల్‌పై స్పష్టత రావాల్సి ఉంది.












