భైంసా పట్టణంలోని ఆరాధన హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముత్యం రెడ్డిని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోంస్లే నారాయణ్ రావు పటేల్ పరామర్శించారు. ముత్యం రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
భైంసా పట్టణంలోని ఆరాధన హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముత్యం రెడ్డిని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోంస్లే నారాయణ్ రావు పటేల్ పరామర్శించారు. ముత్యం రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న పటేల్, ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి, ముత్యం రెడ్డి తన పాత కార్యకర్త అని, ఆయనకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముత్యం రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో శంకర్ చంద్రే, బషీర్, చంద్రకాంత్, శ్రీనివాస్, మధు పటేల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












