లక్ష్మణ్చందా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
నరమలన యోజకుడు శ్రీహరి రావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కి విజ్ఞప్తి చేశారు
*రైతుల త్రీ ఫేజ్ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ కి శ్రీహరి రావు విజ్ఞప్తి* హైదరాబాద్ మనోరంజని తెలుగు టైమ్స్ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు రైతుల త్రీ ఫేజ్ విద్యుత్ సమస్యపై విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా వ్యవసాయ అవసరాలకు సంబంధించిన త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయానికి ప్రధానంగా విద్యుత్‌పై ఆధారపడుతున్న రైతులకు త్రీ ఫేజ్ కరెంట్ సక్రమంగా అందకపోవడంతో పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందించలేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీహరి రావు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వ్యవసాయానికి అవసరమైన త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత మంత్రులు మరియు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు తో పాటు మాజీ జెడ్పీటీసీ మామడ మొహమ్మద్ రఫీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రు నరేశ్ రెడ్డి, మాజీ మామడ సర్పంచ్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు.












