తెలంగాణ, 15 September
స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌కు సమాన హోదా కలిగిన పోస్టుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్‌తో పాటు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం తదితర కేటగిరీలకు చెందిన సుమారు 750 నుంచి 800 మంది ఉపాధ్యాయులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు సమర్పించారు.
స్కూల్ అసిస్టెంట్ సమాన హోదా పోస్టుల రెగ్యులరైజేషన్ చేపట్టాలి నిజామాబాద్: స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌కు సమాన హోదా కలిగిన పోస్టుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్‌తో పాటు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం తదితర కేటగిరీలకు చెందిన సుమారు 750 నుంచి 800 మంది ఉపాధ్యాయులు రెగ్యులరైజేషన్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించి నెల రోజులు పూర్తయినా ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌కు సమాన హోదా కలిగిన పోస్టుల్లో పనిచేస్తున్న సుమారు 750 నుంచి 800 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ను ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలని పీఆర్టీయూ జిల్లా పక్షాన కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.












