కుంటాల, సారంగాపూర్, బోథ్, శివని, హిమాయతనగర్, మహారాష్ట్ర (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు సేకరించి, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా రోజుకు సుమారు 10 బండ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందోనని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దర్జాగా రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలింపు...పగలు రాత్రులు లేకుండా రోజుకి 10 బండ్ల బియ్యం తరలింపు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తున్న సామాన్య జనం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయగా గ్రామీణ ప్రాంతాల నుండి కాక పట్టణ ప్రాంతాల నుండి బియ్యం మహారాష్ట్ర కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు సేకరించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర వైపు శివని ,హిమాయతనగర్ లో ఉన్న దళారులు కుంటాల ,సారంగాపూర్,బోథ్,ప్రాంతాల రహదారి నుండి తరలించి అక్కడ ఎక్కవ రేటుకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యం సంబంధించిన శాఖల అధికారులు నిద్రమత్తులో ఉన్నార లేక వారికి అమ్ముడు పోయారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేద కుటుంబాలకు అందిస్తున్న రేషన్ బియ్యం వారి ఆహార భద్రతకు ఉపయోగపడాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు దానిని వ్యాపారంగా రెషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే వ్యక్తులపై, దానిని నిల్వ చేసే గోదాములపై, రవాణా చేసే వాహనాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న? రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు సారంగాపూర్ టు మహారాష్ట్ర వెళ్తున్న సమాచారం ఉన్న అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలు, రవాణాను గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












