నాదెండ్ల, 9 September
పాతకక్షల నేపథ్యంలో వేణు అనే వ్యక్తిపై సాయి అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడిన హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నాదెండ్ల పోలీసులు నిందితుడు సాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
*హత్యాయత్నం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్* నాదెండ్ల:పాతకక్షల నేపథ్యంలో వేణు అనే వ్యక్తిపై సాయి అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడిన హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు సాయిని అరెస్టు చేశారు. అనంతరం అతడిని చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా.. నేరం ప్రాథమికంగా రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని సబ్ జైలుకు తరలించారు.












