నెక్కొండ, 8 September
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు రెండేళ్ల క్రితం మహబూబాబాద్‌లో హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న బాణోత్ హుస్సేన్‌తో వివాహమైంది. వీరికి ఒక పాప ఉంది.
ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల, పాప ఏడుస్తుండటంతో భర్తకు చూపించి మాట్లాడించేందుకు ఈ నెల 2న వీడియో కాల్ చేసింది. అయితే హుస్సేన్ ఫోన్ కాల్ ఎత్తకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల, వెంటనే మహబూబాబాద్‌లోని అత్తగారింటికి వచ్చి ఎలుకల మందు పేస్ట్ తిన్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












