నిర్మల్, 2026-11-13
భైంసా సబ్ డివిజన్ ఏఎస్పీ సాయికిరణ్ శుక్రవారం తానూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిధిలోని కేసుల పురోగతి, రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ను సందర్శించిన పాఠశాల విద్యార్థులతో మాట్లాడి, పోలీస్ స్టేషన్ విధులు, పోలీసుల బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు. పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రమాదకర ప్రాంతాల పరిశీలన
తదుపరి, ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగిన బెల్తరోడా, బోసి గ్రామాల పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) ఏఎస్పీ స్వయంగా సందర్శించి పరిశీలించారు. జాతీయ రహదారి -161 పరిధిలో ఈ ప్రాంతాలు ఉన్నందున, సంబంధిత ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ () అధికారులతో సమన్వయం చేసుకొని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారిపై హెచ్చరిక బోర్డులు, అవసరమైన రోడ్డు భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, తానూర్ ఎస్హెచ్ఓ జుబేర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






