మోత్కూరు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం అనాజీపురం చౌరస్తా వద్ద శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం అనాజీపురం చౌరస్తా వద్ద శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం జరిగింది. తిరుమలగిరి వైపు వెళ్తున్న ఆయన ప్రయాణిస్తున్న టయోటా కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో, ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆల్టోజ్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లన్నకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆల్టోజ్ కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






