లక్ష్మణచాంద, 10 November
లక్ష్మణచాందా మండలంలో నూతన పెన్షన్లు మంజూరు చేయడాన్ని మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
లక్ష్మణ చందా మండలంలో నూతన పెన్షన్లు మంజూరు చేయడాన్ని మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని పెన్షన్లు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఆయా గ్రామాల సర్పంచులు నూతన పెన్షనర్లకు ఏవైనా ఇబ్బందులుంటే సహకరించాలని, తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఓస రాజేశ్వర్ హామీ ఇచ్చారు. నూతన పెన్షన్లు అందుకోబోతున్న అందరికీ ఓస రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.






