బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 10
పట్టణంలో అడ్వకేట్ విఠల్ ఆధ్వర్యంలో భారత్ పెట్రోలియం రెండో బ్రాంచ్‌గా శ్రీ వైభవ్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పట్టణానికి చెందిన అడ్వకేట్ విఠల్ ఆధ్వర్యంలో, భారత్ పెట్రోలియం రెండో బ్రాంచ్‌గా శ్రీ వైభవ్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షిందే గజానంద్, సర్పంచ్ హల్ద విజయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పహల్ కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ రాము, మాజీ సర్పంచ్ దుప్పె గణేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దీక్షిత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.






