రైతు విద్యుత్ సమస్యపై టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు తక్షణమే స్పందించి, నాలుగు గంటల్లోనే పరిష్కరించారు. 16 కేవీఏ స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా మండలం చింతకుంట గ్రామానికి చెందిన రైతు తోకల దుర్గాజి తన పొలం వద్ద ఉన్న 16 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) రమేష్, 16 కేవీఏ స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్ను కేవలం నాలుగు గంటల్లోనే ఏర్పాటు చేయించారు. ఈ పనులను సహాయ ఇంజినీర్ (ఏఈ) శ్రీకాంత్, లైన్మెన్ ఎల్లన్న, వర్కర్ నవీన్ సమన్వయంతో పూర్తి చేశారు. అధికారుల సత్వర చర్యలతో విద్యుత్ సమస్య పరిష్కారం కావడంతో రైతు తోకల దుర్గాజి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు తోకల దుర్గాజి, ఎస్ఈ రమేష్, ఏఈ శ్రీకాంత్, లైన్మెన్ ఎల్లన్న, వర్కర్ నవీన్‌తో పాటు టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతు సమస్యపై తక్షణ స్పందన నాలుగు
Share:

సారాంశం
గంటల్లోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ముఖ్య విషయాలు
- 16 కేవీఏ స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
- నిర్మల్ జిల్లా మండలం చింతకుంట గ్రామానికి చెందిన రైతు తోకల దుర్గాజి తన పొలం వద్ద ఉన్న 16 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
- వెంటనే స్పందించిన ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) రమేష్, 16 కేవీఏ స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్ను కేవలం నాలుగు గంటల్లోనే ఏర్పాటు చేయించారు.
- రైతు విద్యుత్ సమస్యపై టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు తక్షణమే స్పందించి, నాలుగు గంటల్లోనే పరిష్కరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4537ఆర్టికల్స్
5,43,599వ్యూస్









