మండల పరిధిలోని కిష్టాపూర్, అల్లీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మండల పరిధిలోని కిష్టాపూర్, అల్లీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, కానీ రైతుల విషయంలో రాజకీయం చేస్తూ వారిని తప్పుదోవ పట్టించవద్దని ప్రతిపక్ష పార్టీల నాయకులను కోరారు. అంతేకాకుండా, రైతులు ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో కంటే ఈసారి క్వింటాల్‌కు 20 రూపాయలు అదనంగా పెంచిందని, మరియు సుతిలు కూడా ప్రభుత్వమే రైతులకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సలీం, ఎంపీడీఓ జనార్దన్, ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, సీసీలు కొమురయ్య, వైకుంఠం, శ్రీనివాస్, ఆయా గ్రామాల సీఏలు, సర్పంచులు కాసం రాజిరెడ్డి, కుంబాల మణెమ్మ, ఉప సర్పంచులు కోలన్ పాక శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్లు సలీం, భూపతిరెడ్డి, రాజా వర్ధన్ రెడ్డి, విజయ్ మైపాల్, రాగుల అశోక్, ఉడుతా జయంత్, నాయకులు గొట్టిపర్తి చందు, మందల తిరుపతి రెడ్డి, హరి బాబు, పంతం శ్రీనివాస్, రాజిరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


