రైతుల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం, అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మండల పరిధిలోని గోనేపల్లి, పెద్దకోడూరు, , రామంచ, గంగాపూర్, విఠలాపూర్, రంగయ్యపల్లి, ఎల్లయ్యపల్లి, మాచాపూర్, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు వడ్లు చేరుకున్న వెంటనే ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా రైతులకు ప్రాధాన్యతనిస్తూ క్రమపద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తూకం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, ఎల్నినో విపత్తు ప్రభావం, దాని వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాల గురించి ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు పాకాల భూపతిరెడ్డి, మహమ్మద్ సలీం, నమూన్ల వినోద్, బాలలక్ష్మి, అశోక్, అనుపాటి విజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్, తాళ్లపల్లి రాజు, మండల సీనియర్ నాయకులు పొన్నాల రాజేష్, గొట్టిపర్తి చందు, కొమ్ము ప్రశాంత్, గోపు హరిబాబు, పంతం శ్రీనివాస్, కొమ్ము ఎల్లయ్య, కొమ్ము రాజు, మహేందర్ రెడ్డి, ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, కాలు వైకుంఠం, రాజ్ కుమార్, కొమురయ్య, సీఏలు, గ్రామ సంస్థల సహాయకులు, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












