గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ నాయకులు నూతనంగా నియమితులైన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ (/) నందగోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్, జిల్లాలోని గౌడ గీత కార్మికుల సమస్యలను తో చర్చించారు.
అక్రమ లైసెన్సులపై ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలంలో గీతావృత్తికి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు అక్రమ దారిలో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి లైసెన్సులు జారీ చేయకుండా చూడాలని నాయకులు కోరారు. వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవనోపాధిని దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూదుల భూమేష్ గౌడ్, కార్యనిర్వహణ అధ్యక్షులు బొజ్జ చిన్న గౌడ్, ఉపాధ్యక్షులు మడిపల్లి ఉపేందర్ గౌడ్, ఉడుతల కృష్ణాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బొడ్డు తిరుపతి గౌడ్, ఉడుతల భిక్షపతి రాజు గౌడ్ మొదలగు మోకుదెబ్బ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.











