పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్బీ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన బైంసా పట్టణ సమీపంలోని సాత్పుల్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే, తానూర్ పోలీస్ స్టేషన్లో ఎస్బీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బేంబర్ గ్రామానికి చెందిన బాపూరావు, దసరా పండుగతో పాటు ధమ్మచక్ర పరివర్తన శోభాయాత్ర సందర్భంగా నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో విధులు నిర్వహించారు. విధుల్లో ఉండగా రాత్రి టీ తాగేందుకు బైంసాలోని భోకర్ చౌరస్తా వైపు వెళ్తుండగా, సాత్పుల్ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అదే సమయంలో భోకర్ చౌరస్తా నుంచి బైంసా వైపు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వస్తున్న తానూర్ మండలానికి చెందిన దిలీప్ అనే యువకుడి బైక్, కానిస్టేబుల్ బాపూరావు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాపూరావు అక్కడికక్కడే మృతి చెందగా, దిలీప్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన యువకుడికి చికిత్స
గాయపడిన యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బైంసా పట్టణ పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.












