భారత జనాభా గణన -2027కు సంబంధించి నిర్మల్ జిల్లాలో రెండవ దశ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లోని చార్జ్ క్లర్క్ లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఈ శిక్షణ ఇచ్చారు.
జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జనగణన సిబ్బందికి వివిధ అంశాలపై క్షుణ్ణంగా శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గంగారెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ తెలంగాణ డి.వి. రమణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












