జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని మండల విద్యాధికారి (ఎంఈఓ) నరేందర్ ఘనంగా అభినందించి, చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ముఖ్యంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు, వినూత్న బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యను మరింత సులభంగా, ఆసక్తికరంగా అందించాలని సూచించారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు మాట్లాడుతూ, ఈ గుర్తింపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తామని, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఆధునిక, నూతన బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తామని వెల్లడించారు.
ఉపాధ్యాయుల సేవలను గుర్తించి అభినందించడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, విద్యారంగ అభివృద్ధికి ఇటువంటి ప్రోత్సాహం దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.












