మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజుర నియోజకవర్గం లక్కడ్‌కోట్ గ్రామానికి చెందిన పోలీసు శాఖ ఉద్యోగి దుర్గం లక్ష్మీకాంత్, నలీనల వివాహ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్9 టీవీ కొమురం భీం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ డోంగ్రీ రవీందర్ హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
చంద్రపూర్‌లోని పోలీసు సభాగృహంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న దుర్గం లక్ష్మీకాంత్ వివాహానికి బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా స్టాఫ్ రిపోర్టర్ డోంగ్రీ రవీందర్ నూతన దంపతులను అభినందించారు. ఈ వివాహ వేడుకల్లో దర్శన, శిల్ప, దుర్గం రవీ, కావేరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

