చిన్నకోడూరు మండలంలోని కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన సంపంగి మల్లయ్య ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని వంగ రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఈ విషయం వంశీ ద్వారా ఆయన దృష్టికి వెళ్లడంతో, వెంటనే స్పందించిన రాజేశ్వర్రెడ్డి బాధిత కుటుంబానికి తన వంతు సహాయాన్ని అందించారు.
50 కిలోల బియ్యాన్ని అందజేసి, కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఆర్ బృందం సభ్యులు వంశీ, శేఖర్, సంపత్, అనిల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.











