నమస్తే తెలంగాణా దిన పత్రిక పాత్రికేయులు షాహిద్ మాతృమూర్తికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు లోకేశ్వరం మండలంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
లోకేశ్వరం మండలానికి చెందిన నమస్తే తెలంగాణా దిన పత్రిక పాత్రికేయులు షాహిద్ మాతృమూర్తికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్, ముధోల్ సమన్వయకర్త సమితి సభ్యులు లోలం శ్యామ్ సుందర్, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ ఎంపీపీ సాగర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ దిగంబర్, మాజీ వైస్ ఎంపీపీ సాయన్న, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. షాహిద్ కుటుంబానికి వారు సంఘీభావం తెలిపారు.












