మహారాష్ట్రలోని ప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుడిని సోమవారం బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పాటిల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు ఆనందరావు పాటిల్‌ను శాలువాతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.












