నిర్మల్ జిల్లా తానుర్ మండలం ఉమ్రి(కె) గ్రామంలో ఏడో రోజు గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్రను నిర్వహించి నిమజ్జనం చేశారు.
ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సైల పర్యవేక్షణలో పోలీసులు నిమజ్జన కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఎస్పీ సాయికిరణ్ పర్యవేక్షణలో ముధోల్ నియోజకవర్గంలోని మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏడో రోజు వినాయక శోభాయాత్రలు కొనసాగాయి. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.












