గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 16
వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించే యాప్‌ల వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలిచింది. కెనడాకు చెందిన ఒక యాప్ రహస్య డేటింగ్ పేరుతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి వేదికగా మారింది. ఈ యాప్‌లో నగరవాసులు అధిక సంఖ్యలో సభ్యులుగా నమోదు చేసుకున్నారు.
వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించే యాప్‌ల వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలిచింది. కెనడాకు చెందిన ఒక యాప్ రహస్య డేటింగ్ పేరుతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి వేదికగా మారింది.
తాజాగా ఆ విదేశీ యాప్ సంస్థ ప్రకటించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉండగా, వీరిలో హైదరాబాద్‌కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు.
యూజర్ల సంఖ్య ఆధారంగా చూస్తే, భాగ్యనగరం దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఐటీ కారిడార్లు అయిన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే తమ యాప్‌నకు 60 శాతం ట్రాఫిక్ వస్తోందని ఆ సంస్థ తెలిపింది.
మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, ఈ యాప్‌లో కొత్త సబ్స్క్రైబర్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని సమాచారం.












