అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు బాసరలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ సాయికుమార్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయ పరిసరాలతో పాటు అంతర్రాష్ట్ర రహదారిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
జిల్లా పోలీసులు బాసరలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ సాయికుమార్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
బాసర రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయ పరిసరాలతో పాటు బాసర నుంచి నాయగామ్ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.







