సారంగాపూర్, 13 November
నిర్మల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కీలక నీటిపారుదల సమస్యల పరిష్కారం కోసం నిర్మల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు, రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, 4 వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. స్వర్ణ నదిపై లో లెవల్ కాజ్ వే, మామడలో లిఫ్ట్ ఇరిగేషన్, ప్యారామూర్ చెరువుల మరమ్మత్తు, నర్సాపూర్ దేవుని చెరువు కట్ట పునర్నిర్మాణం వంటి అంశాలపై ఆయన విజ్ఞప్తి చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కీలక నీటిపారుదల సమస్యల పరిష్కారం కోసం నిర్మల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు, రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, 4 వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. మండలం, యాకర్ పల్లి గ్రామం వద్ద స్వర్ణ నదిపై లో లెవల్ కాజ్ వే నిర్మించాలని శ్రీహరి రావు కోరారు. యాకర్ పల్లి రైతులకు నదికి ఇరువైపులా పొలాలు ఉన్నాయని, జూలై నుండి అక్టోబర్ వరకు వానాకాలం పంటలకు కీలక సమయంలో నదిలో నీరు ఉండటం వల్ల కుడి ఒడ్డున ఉన్న పొలాలకు వెళ్ళలేకపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం మలక్ చించోలి గ్రామం మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి రావడం రైతులకు ఇబ్బందితో పాటు ఆర్థిక భారాన్ని కలిగిస్తోందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఏడాది అక్టోబర్ లో జరిగే ప్రముఖ అడెల్లి పోచమ్మ గంగ నీళ్ళ జాతర కు , దిలావర్ పూర్ మండలాల నుండి భక్తులు యాకర్ పల్లి వద్ద స్వర్ణ నదిని దాటి అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్తారని, భక్తులను సురక్షితంగా నది దాటించడం పోలీసు, రెవెన్యూ అధికారులకు కష్టంగా మారుతోందని వివరించారు. కాజ్ వే నిర్మిస్తే రైతులకు, భక్తులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. మామడ మండలంలోని మామడ, కప్పన్ పల్లి, దిమ్మదుర్తి గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేయాలని కోరారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 1,000 ఎకరాల ఆయకట్టు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉందని, చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గోదావరి నది నిర్మల్ జిల్లా గుండా ప్రవహిస్తున్నా, మెట్ట గ్రామాలకు నీరు అందడం లేదని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని సరస్వతి కాలువ ద్వారా నీరు అందే తుర్కం చెరువు నుండి నీటిని లిఫ్ట్ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం మంజూరైతే 1,000 ఎకరాలకు సాగునీరు అంది, దిగుబడితో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. మండలం, ప్యారామూర్ గ్రామంలోని పసన్న చెరువు, ఊర చెరువు, భీమన్న చెరువుల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు చెరువుల కింద సుమారు 800 ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువుల కట్టలు, తూములు దెబ్బతింటున్నాయని తెలిపారు. సరైన సమయంలో మరమ్మత్తులు చేయకపోవడంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయిందని, ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మూడు చెరువుల కట్టల పటిష్టత, తూముల మరమ్మత్తులు, ఫీడర్ కాలువలు తదితర పనులకు నిధులు మంజూరు చేసి, పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని దేవుని చెరువు కట్ట పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అడవి పక్కనే ఉన్న ఈ చెరువు, అడవి జంతువుల నీటి అవసరాలు తీర్చడంతో పాటు, చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులకు నీరు అందించడం, భూగర్భ జలాలు పెంచడం, ఆయకట్టు భూములకు సాగునీరు అందించడంలో కీలకంగా ఉందని తెలిపారు. కానీ, జూలై-2025 లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట పూర్తిగా తెగిపోయి, ప్రస్తుతం ఒక్క చుక్క నీరు కూడా నిలవడం లేదని, దీంతో రైతులు, గ్రామస్తులు, వన్యప్రాణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి కట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వినతి పత్రాలను సావధానంగా ఆలకించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రావుతో పాటు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ ఉమ మహేష్ రావు, వడ్లకొండ నవీన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.



