కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) ప్యానెల్‌ను పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త కమిటీలో తెలుగు నిర్మాత సుప్రియా యార్లగడ్డతో పాటు పలువురు ప్రముఖులకు చోటు కల్పించారు.
సెన్సార్ బోర్డ్ కొత్త ప్యానెల్లో నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, రూపాలీ గంగూలీ, ప్రియదర్శన్, సంగీత దర్శకుడు రికీ కేజ్, తెలుగు నిర్మాత సుప్రియా యార్లగడ్డ వంటి ప్రముఖులకు స్థానం లభించింది.
ఈ నూతన కమిటీ మూడేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు తమ విధులను నిర్వర్తించనుంది.












