తెలంగాణ, 8 September
మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అణిచివేత చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఈ దాడిని నిరసిస్తూ పాత్రికేయులు ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం... అణిచివేత చర్యలు ప్రజాస్వా మ్య స్ఫూర్తికి విరుద్ధము....... పి ఆర్ టి యు జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి . నేడు ధర్మా చౌక్ వద్ద పాత్రికేయుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి ఆర్ టి యు ా జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేస్తూ మహిళా జర్నలిస్టులకు న్యాయం చేయాలని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించేది పోయి అణిచివేత చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ధర్నా చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీ భావంతెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపా ఖాన్ సాబ్, మాజీ ఖాన్, హుస్సేన్ , వసీహేమాద్, నాదిం అహ్మద్, డాక్టర్ సజ్జాద, నర్సింలు, జర్నలిస్టు సుభాష్, మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, కైసర్ తదితరులు పాల్గొన్నారు












