సారంగాపూర్, 11 September
మండల కేంద్రంలోని వివేకానంద హైస్కూల్ విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేసి, మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితోనే వినాయక విగ్రహాలను పూజించాలని వారు సూచించారు.
మట్టి విగ్రహాలు ప్రోత్సహించాలి. వివేకానంద హైస్కూల్ విద్యార్థులు మండల కేంద్రంలోని వివేకానంద హైస్కూల్ విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలు చేసి మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నేరెళ్ల ఉషారాణి, మాట్లాడుతూ వినాయక చవితి మట్టి విగ్రహాలతో జరుపుకావాలని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ సముద్రాల గీత మాట్లాడుతూ మట్టి విప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












