కులాస్పూర్, కులాస్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
కులాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన షూస్, సాక్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనిత, గ్రామ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ మహిపాల్, వీవీడీసీ చైర్మన్ శశిధర్ రెడ్డి తదితరులు విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేశారు.
కులాస్పూర్ పాఠశాలలో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ కులాస్పూర్: జెడ్పీహెచ్ఎస్ కులాస్పూర్ పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన షూస్, సాక్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనిత, గ్రామ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ మహిపాల్, వీవీడీసీ చైర్మన్ శశిధర్ రెడ్డి తదితరులు విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉచితంగా షూస్, సాక్స్ అందజేయడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు, సర్పంచ్, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.












