డైట్ లెక్చరర్ కొర్ర కృష్ణ కాంత్ నాయక్, మెహరాజ్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పండిత్ రెడ్డి, ప్రశాంతి లకు సన్మానం :
మిర్యాలగూడ సెప్టెంబర్ 26 (మనోరంజని తెలుగు టైమ్స్) తెలంగాణమ్యాథమెటిక్స్ (టీ ఎం ఎఫ్) ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలబకలవాడ లో గణితం కాంప్లెక్స్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగావిద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.డైట్ లెక్చరర్స్గానియమితులైన కొర్ర కృష్ణ కాంత్ నాయక్, ఎండి మెహరాజ్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పండిత్ రెడ్డి, ప్రశాంతి లను ఘనంగా సన్మా నించారు.కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తినిపెంపొందించడంతో పాటు నాణ్యమైన విద్యనుఅందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యారంగంలో ప్రతిభ కనబరిచినఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకుఅభినందనలు తెలియజేస్తూ, వారు తమ అనుభవం, బోధనా నైపుణ్యాలతో విద్యార్థుల విద్యాభివృద్ధికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీతలు తమను గుర్తించి గౌరవించిన తెలంగాణ మ్యాథమెటిక్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.పి సైదిరెడ్డి, టీ.ఎం.ఎఫ్ నాయకులు శ్రీశైలం, శ్రీనివాసరావు, శశిధర్ రెడ్డి, తావూరియా, పద్మ, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి, స్కైలాబ్, గురువారెడ్డి, నాగార్జున రెడ్డి, లోక్య నాయక్, కవిత, వెంకటేశ్వర్లు, గిరిజ, రజిత, బాలు, రామ్ సింగ్, వెంకట్ రెడ్డి, రాంబాయి, రాజ్యలక్ష్మి,శోభ తదితరులు పాల్గొన్నారు












