నిర్మల్ పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాల భవంతిని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పాఠశాల భవనాన్ని పరిశీలించి, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాల భవంతిని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా వినియోగించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కస్బా ఉన్నత పాఠశాల భవంతిని పరిశీలించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవంతిని బీసీ విద్యార్థుల వసతి గృహంగా మార్చి, వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు.
భవనంలో అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు అనుకూలమైన వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. వసతి గృహం అందుబాటులోకి వస్తే బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డీఈవో భోజన్న, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












