కోరగా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
మిర్యాలగూడలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆర్డీవో ఎస్. రమణారెడ్డి సూచించారు. బుధవారం జరిగిన సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఆయన మాట్లాడుతూ, నిమజ్జనం, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి : ఆర్డీవో రమణారెడ్డి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మిర్యాలగూడ ఆర్డిఓ ఎస్. రమణారెడ్డి కోరారు. బుధవారం స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన అఖిల పక్షం, గణేష్ మండపాల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరాత్రులు నిర్వహించే వారు ఆయా మండలాల పట్టణాల అధికారులకు నిమజ్జనం కార్యక్రమం వివరాలు అందజేయాలని మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ లో వాడపల్లి వద్ద కృష్ణనదిలో, అదేవిధంగా నాగార్జునసాగర్ కృష్ణా నదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నందున అక్కడ సాధ్యమయ్యే అవకాశాలున్నాయన్నారు. అక్కడ నిమజ్జనంకై ఆర్ అండ్ బి అధికారులకు బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దికరణకు విద్యుత్ శాఖ అధికారులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పారిశుద్ధ్యం, తాగు నీటి సౌకర్యం మిర్యాలగూడ మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నిమజ్జన సమయంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డిఓ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న నిర్వాహకులు ఈ నెల 14 నుండి గణేష్ నవరాత్రులు నిర్వహించే వారు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ అనుమతి తీసుకోవాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాశయకులు చిలుకూరు బాలకృష్ణ, దేశిడి శేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు చిలుకూరు శ్యాం, రేపాల పురుషోత్తంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












