సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో దుర్గామాత విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గ్రామ సర్పంచ్ సాయన్న, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు 8 మంది దాతలు ముందుకు రాగా, అందరి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఎన్. గంగాధర్ దుర్గామాత విగ్రహ ఏర్పాటు హక్కును దక్కించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షులు రవి, ఉప సర్పంచ్ పోశెట్టి, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు కోస్తాపూర్ పోశెట్టి, పోతిండ్ల శంకర్, దుర్గామాత భక్తులు పాల్గొన్నారు.












