నిర్మల్ జిల్లా బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం గోహారతి కొనసాగింపు అని నిర్వాహకులు తెలిపారు. శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద గిరి స్వామీజీ సహకారంతో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో పుర ప్రముఖులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోహారతి ఇచ్చారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. గోమాత అనుగ్రహంతో రుణ బాధలు, సకల దోషాలు తొలగిపోయి సత్సంతానం, శీఘ్ర కల్యాణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతాయని వేద పండితులు గురుచరణ్ తెలిపారు. బాసర గోదావరి నది తీరంలో గతంలో నిరంతరాయంగా నిర్వహించిన గంగాహారతి తరహాలోనే, వేదభారతి పీఠంలో ప్రతి శనివారం గోహారతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేద విద్యానంద గిరి స్వామీజీ బాసరలో వేదభారతి పీఠం అభివృద్ధి ట్రస్టును ఏర్పాటు చేసి, వేద పాఠశాల, గోశాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వేదాల విశిష్టతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో స్వామీజీ రచించిన ప్రతి ఇంటింటా వేదం పుస్తకాన్ని, శ్లోకాలు, సంకల్పంతో ప్రతి ఇంటికీ చేర్చడమే తమ సంకల్పమని నిర్వాహకులు తెలిపారు.
బాసరలో ఘనంగా గోపూజ, రుద్రాభిషేకం, గోహారతి
Share:

సారాంశం
ప్రతి శనివారం గోహారతి కొనసాగింపు: నిర్వాహకులు
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
- శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద గిరి స్వామీజీ సహకారంతో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో పుర ప్రముఖులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- గోమాత అనుగ్రహంతో రుణ బాధలు, సకల దోషాలు తొలగిపోయి సత్సంతానం, శీఘ్ర కల్యాణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతాయని వేద పండితులు గురుచరణ్ తెలిపారు.
- ప్రతి శనివారం గోహారతి కొనసాగింపు అని నిర్వాహకులు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3958ఆర్టికల్స్
4,79,862వ్యూస్










