నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో ధర్మ పరిరక్షణ, దేశ సుభిక్షం, లోక కళ్యాణం కోసం ప్రత్యేక వైదిక హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ధర్మమార్గంలో పురోగమించాలనే మహా సంకల్పంతో, ధర్మో రక్షతి రక్షితః, లోకా: సమస్తా: సుఖినో భవంతు అనే వేద ఘోషతో పీఠాధిపతి శ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేదమూర్తులైన ఋత్విక్కులు స్వస్తి వాచనం, ఆయుష్య, ధన్వంతరి, రాజ్యాధికార హోమాలు జరిపారు.
ఈ హోమాది కార్యక్రమాల్లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మహాముని శ్రీ యోగి శుక్రాయి నాథ్ పాల్గొన్నారు.
ఈనెల 17వ తేదీ నుండి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ యజ్ఞంలో వేద ఘోషతో పీఠం మార్మోగుతోంది.












