జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ (మాతా శిశు సంక్షేమ) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. ఏడు రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బాప్పా మోరియా నినాదాలతో మార్మోగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారులు మాట్లాడుతూ, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో చేరే ప్రతి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ విఘ్ననాయకుడిని వేడుకున్నాము అని తెలిపారు. భక్తులకు, ఆసుపత్రి సిబ్బందికి తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
అనంతరం స్థానిక జలశయంలో స్వామివారి విగ్రహాన్ని భక్తిప్రపత్తులతో నిమజ్జనం చేశారు. ఈ శోభాయాత్రలో ఎంసీహెచ్ వైద్యులు, హెడ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












