వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామడుగు గ్రామంలో మాల సంఘం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తాసిల్దార్ దాసరి రాజ మల్లయ్య, ఎస్ఐ కే రాజు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపతో ఏటా ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం పూజలు, భజనలకే పరిమితం కాకుండా, అన్నదానం మహాదానం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం సంతోషదాయకమని వారు తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పూర్తి సహకారాన్ని అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు స్వయంగా వడ్డించి, క్రమశిక్షణతో ప్రసాద వితరణ జరిగేలా పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు భక్తులకు, సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మొయిజ్, 14వ వార్డ్ మెంబర్ సిరికొండ పల్లవి సాయి, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











