నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలోని శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయంలో గురువారం రాత్రి భక్తి కార్యక్రమం నిర్వహించారు. హరిదాస భజన పాఠకుడు శివమూర్తి మహారాజ్ జూలకంటి, మెదక్ ఆధ్వర్యంలో తెలుగు కీర్తనలు ఆలపించారు.
నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలోని శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయంలో గురువారం రాత్రి భక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయంలో హరిదాస భజన పాఠకుడు శివమూర్తి మహారాజ్ జూలకంటి, మెదక్ ఆధ్వర్యంలో తెలుగు కీర్తనలు ఆలపించారు.
రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కీర్తనలను ఆలకించారు. స్వామివారి సన్నిధిలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.











