నిమజ్జనోత్సవాలు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 27
నిర్మల్ జిల్లాలో గణేష్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ నాయకత్వంలో అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి. నిమజ్జనోత్సవాల సందర్భంగా సుమారు 36 గంటల పాటు పోలీసులు నిరంతరాయంగా విధుల్లో ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
నిర్మల్ జిల్లాలో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ నాయకత్వంలో అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర పోలీస్ అధికారులు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది సుమారు 36 గంటల పాటు నిరంతరంగా విధుల్లో ఉండి, శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించారు.
నిమజ్జన శోభాయాత్రలు జరిగే మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ ప్రాంతాల పర్యవేక్షణ, విగ్రహాల నిమజ్జన ప్రక్రియ, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనకు కూడా తావులేకుండా నిమజ్జనోత్సవాలను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ, గణేష్ ప్రశాంతంగా పూర్తి కావడానికి సహకరించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 36 గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వహించి గణేష్ నిమజ్జనోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.












