భైంసా, 11 September
జిల్లా భైంసా పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, ఆరు గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మదీనా కాలనీలో ఒక కిరాయి మడిగిలో ఈ నిల్వలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
*భైంసాలో 21 క్వింటాళ్ల పి డి ఎస్ బియ్యం సీజ్* *కిరాయి మడిగిలో అక్రమ నిల్వలు.. ఆరు గ్యాస్ సిలిండర్లు కూడా పట్టివేత* జిల్లా ప్రజావాణి :- జిల్లా భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించిన 21 క్వింటాళ్ల పి డి ఎస్ బియ్యాన్ని కరీంనగర్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మదీనా కాలనీకి చెందిన షేక్ ఫరూక్ కిరాయికి తీసుకున్న మడిగిలో బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సీజ్ చేసిన బియ్యాన్ని ప్రస్తుతం జమీల్ బేగ్కు చెందిన పీడీఎస్ దుకాణంలో భద్రపరిచారు. గురువారం ఉదయం ప్రభుత్వ గోదాముకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. బియ్యం నిల్వకు సంబంధించిన వివరాలు, దాని మూలాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. అదేవిధంగా షేక్ రజాక్ వద్ద అక్రమంగా ఉన్నట్లు గుర్తించిన ఆరు గ్యాస్ సిలిండర్లను కూడా అధికారులు పట్టుకున్నారు. బియ్యం, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అధికారులు పంచనామా నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ సివిల్ సప్లైస్ కరీంనగర్ ఏఎస్ఓ సీతారెడ్డి, డీటీ ఎన్ఫోర్స్మెంట్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ నిల్వలు, పీడీఎస్ బియ్యం దుర్వినియోగం, అనధికార గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.












