మండలం పార్డి(బి) గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు రైతు సుణుగూరు నారాయణ పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైతుల ఆవేదన
ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడటమే కాకుండా మరమ్మతుల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.












