కామారెడ్డి పట్టణంలోని కొఠారి గల్లీలో మంగళవారం సాయంత్రం మహిళ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అనసూయను గుర్తుతెలియని వ్యక్తి హత్య చేసి, నగదు, బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
కొఠారి గల్లీకి చెందిన సుదర్శన్, అనసూయ దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య సుదర్శన్ గుడికి వెళ్లిన సమయంలో అనసూయ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పట్టణ సీఐ బి. నరహరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.












