నిర్మల్, 10 September
నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొని, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలెక్టరేట్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ముందుగా అదనపు కలెక్టర్‌తో పాటు అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన కీలక పాత్రను గుర్తు చేశారు. నాటి కాలంలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి తెలంగాణ పోరాట చరిత్రలో ఐలమ్మ గొప్ప అధ్యాయాన్ని లిఖించారని పేర్కొన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం పోరాడిన గొప్ప మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆమె వంటి వీరవనితల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, సీపీఓ గంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












