మిర్యాలగూడ, 10 September
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ చౌరస్తాలోని ఆమె విగ్రహం వద్ద పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మకురజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి విగ్రహం ఐలమ్మ చౌరస్తాలో ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారంమిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరు సుధా బాలకృష్ణ , కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగానిలిచిపోయిందన్నారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికిస్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగంతులనాగభూషణం, పోసాని గిరి, సలకలపురం యాదగిరి, వేమవరపు భీమరాజు, జలనీల రాజశేఖర్, నారాయణదాసు వెంకటేష్, నారాయణ, రాములు ,దోనకొండ వెంకన్న ,తుకారం , పగిళ్ల కళ్యాణ్, పలువురు నాయకులు, ప్రజాసంఘాలప్రతినిధులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.












