ప్రభుత్వానికి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 12
కులవృత్తి అభివృద్ధిలో భాగంగా మేరు కుల సభ్యులందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కామారెడ్డి జిల్లా మేరు సంఘం విజ్ఞప్తి చేసింది. కామారెడ్డి పట్టణంలో జరిగిన సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
మేరు కుల సభ్యులందరికీ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వాలి జిల్లా మేరు సంఘం విజ్ఞప్తి ( కామారెడ్డి పట్టణంలోని మేరు సంఘం కార్యాలయంలో జిల్లా మేరు సంఘం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్. నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేరు కుల సభ్యుల సమస్యలు, కులవృత్తి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్. నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. మేరు కులవృత్తి ప్రధానంగా కుట్టు మిషన్లపై ఆధారపడి ఉందని, కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మేరు కుల సభ్యులందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కుట్టు మిషన్లు అందించడం ద్వారా మేరు కుటుంబాలకు జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తకొండ భాస్కర్, పట్టణ అధ్యక్షుడు గట్ల భాను, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్, జిల్లా కోశాధికారి సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి దేవేందర్, రుద్రంగి రమేష్తో పాటు కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, మేరు కుల బంధువులు పాల్గొన్నారు.










