కోర్టు చౌరస్తా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని శ్రీ మల్లేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని నాయకులు కొనియాడారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహణ ఎఫ్‌సీఐ : భూమి కోసం, భుక్తి కోసం దొరల అహంకారాన్ని ఎదిరించి, నిరుపేదల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని శ్రీ మల్లేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రజక సంఘం నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం కోర్టు చౌరస్తా ఫౌండేషన్ అధ్యక్షుడు పాలడుగుల కనకయ్య, ఎఫ్‌సీఐ మల్లేశ్వర రజక సంఘం నాయకులు నగునూరు కనకయ్య, పున్నం కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాపాల మల్లయ్య, బొడ్డుపల్లి నారాయణ, రాచూరి నర్సయ్య, మడికొండ శంకర్, పెనుగొండ నర్సింగ్, పున్నం రాజు, పున్నం సంపత్ తదితర రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే డివిజన్ కార్పొరేటర్లు కందుల స్వరూప–సతీష్, కన్నూరి భాగ్యలక్ష్మి–శంకర్, గౌరవ కార్పొరేటర్లు ఆడపు రాజేశం, పల్ల లక్ష్మణ్, బక్కన్న, మేకల రామస్వామి, షరీఫ్, వేణు, తాజ్, శాతరాజు కొమురయ్య, ముఖ్యర వెంకటేష్‌తో పాటు వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.












